స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే మీకు సరైన అవకాశం.. ఎందుకంటే దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. హైఎండ్ స్మార్ట్‌ఫోన్ల నుంచి లో ఎండ్ స్మార్ట్ ఫోన్ల దాకా వివరాలు భారీగా తగ్గాయి. యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఈ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, హెచ్టీసీ, వివో, మోటరోలా, నోకియా, ఆసుస్ వంటి ఎన్నో కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 11 వేల వరకూ తగ్గిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాయి. మంచి ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక అధ్భుత అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఫోన్ ధర ఏ మేరకు తగ్గిందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే




గెలాక్సీ ఎస్8 ప్లస్


శాంసంగ్ తానందిస్తున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ధరను రూ. 64,900 నుంచి రూ. 53,900కు తగ్గించింది. ఆండ్రాయిడ్ ఓరియోపై పనిచేసే ఈ ఫోన్ ధరను రూ. 11 వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫీచ‌ర్లు...

6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌

64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్

12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఐపీ68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్

యాక్స‌ల‌రోమీట‌ర్‌, బారో మీట‌ర్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, గైరో సెన్సార్

జియో మాగ్నెటిక్ సెన్సార్‌, హాల్ సెన్సార్

హార్ట్ రేట్ సెన్సార్‌, ఆర్‌జీబీ లైట్ సెన్సార్

ఐరిస్ సెన్సార్, ప్రెష‌ర్ సెన్సార్

4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ

3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్






శాంసంగ్ గెలాక్సీ ఎస్8


శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ధరను రూ. 57,900 నుంచి రూ. 7,910 తగ్గిస్తూ, రూ. 49,990గా ప్రకటించింది.

6.2 ఇంచెస్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే

స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్

64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7 నౌగట్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్

12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఎస్‌ 8 లో 3,000 ఏంఏహెచ్‌ బ్యాటరీ

ఎస్‌8ప్లస్‌లో 3,500 ఏంఏహెచ్‌ బ్యాటరీ అమర్చింది.






నోకియా 8


నోకియా 8 మోడల్ పై రూ. 8 వేల తగ్గింపు. ఇప్పటివరకూ రూ. 36,999గా ఉన్న ఈ ఫోన్ ఇకపై రూ. 28,999కి లభ్యమవుతుందని తెలిపింది. 5.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ ప్లే, 4 జీబీ రామ్, 64 జీబీ మెమొరీ దీని ప్రత్యేకతలు.

నోకియా 8 ఫీచ‌ర్లు

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0






హెచ్టీసీ యూ


హెచ్టీసీ సంస్థ తన యూ 11 ధరను రూ. 5,991 మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ ఇకపై రూ. 45,999కి లభిస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ నోగట్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, 6 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని

Post a Comment

Previous Post Next Post