సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ వాట్సప్ యూజర్లకు ఆందోళనకర వార్తను అందించింది. దాని అధినేత Mark Zuckerberg అమెరికన్ సెనేట్ ముందు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే అవి వినేవారికి ఆసక్తికరంగా ఉన్నా అర్థం చేసుకునే వారికి మాత్రం కొంచెం ప్రమాదకరంగా మారనున్నాయని తెలుస్తుంది. కాగా ఫేస్‌బుక్ డేటా చోరి వ్యవహారంతో సంచలనం కలిగించే పలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాట్సప్ యూజర్లకు ఆందోళన కలిగించే వార్త కూడా బయటకొచ్చింది. అవేంటో ఓ సారి మీరే చూడండి.
సెనేట్ సభ్యుల విచారణలో ఫేస్‌బుక్ రెవిన్యూ మోడల్ ఏంటి అని వారడిగిన ప్రశ్నకు జుకర్‌బర్గ్ బదులిస్తూ.. ఫేస్‌బుక్ ప్రధాన వ్యాపారం ప్రకటనలనేనని, ప్రకటనల ద్వారా ఫేస్‌బుక్ నగదు సంపాదిస్తుందని, యూజర్లు నగదు చెల్లించకుండా తామెలా సర్వీసులను అందించగలమని సమాధానం చెప్పారు.
ఈ సమాధానంలో ఇప్పుడు అనేక ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానంగా వాట్సప్ యూజర్లు ఆందోళన పడ్డారు. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సప్ ఇప్పటి వరకు ఉచితంగానే సర్వీసులు అందిస్తోంది. ఇప్పటి వరకైతే వాట్సప్‌కు ఎలాంటి యాడ్స్ లేవు. కానీ భవిష్యత్తులో వ్యాపార ప్రకటనలే తమ ప్రధాన రెవెన్యూలు అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పకనే చెప్పేశారు.
వాట్సప్ నుంచి కూడా లాభాలు ఆర్జించడానికి, దీనిని కూడా యాడ్స్ వైపు మరలిస్తారని తెలుస్తోంది. ఒకవేళ వాట్సప్‌లోకి యాడ్స్ రావడం మొదలు పెడితే, మీ బాయ్‌ఫ్రెండ్‌లకు పంపిన మెసేజ్‌లతో సహా మొత్తం డేటాన్నంతటినీ లోతుగా స్కాన్ చేయడం ఫేస్‌బుక్ ప్రారంభించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని టెక్ విశ్లేషకులంటున్నారు.
అయితే వాట్సప్ చాట్‌లన్నీ ఎన్‌క్రిప్టెడ్ అని ఓ వైపు కంపెనీ చెబుతున్నప్పటికీ, ఫేస్‌బుక్ వాట్సప్ యూజర్ల డేటా అంతటినీ స్కాన్ చేస్తూ అడ్వర్‌టైజింగ్ సర్వీసులను ఫేస్‌బుక్ అందిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వాట్సప్ యూజర్లు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాలని హెచ్చరికలు వస్తున్నాయి.
కాగా ఇప్పటికే బిజినెస్ సర్వీసులను అందించడానికి వాట్సప్ బటన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఫేస్‌బుక్ యాడ్‌చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. దీంతో పాటు వాట్సప్ ఫర్ బిజినెసెస్ అనే ఫీచర్‌ను కూడా వాట్సప్ తీసుకొచ్చింది. దీంతో యాడ్స్ అనేవి నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి.
మరోవైపు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కోసం ఫేస్‌బుక్‌తో వాట్సప్ యూజర్ల డేటాను షేర్ చేస్తున్నామని అంతకముందే వాట్సప్ కంపెనీ ప్రకటించింది. దీనిపై పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు దేశాల్లో దీనిని నిరాకరిస్తూనే ఉన్నారు. వాట్సప్ దీని కోసం తన ప్రైవసీ పాలసీని కూడా మార్చేసింది.
గతంలో జరిగిన ఈ పరిణామాలను ఒకసారి బేరీజు వేసుకుంటూ ఇప్పుడు జుకర్‌బర్గ్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, త్వరలోనే వాట్సప్‌లోకి యాడ్స్ వచ్చేసి, యూజర్ల డేటా స్కాన్ చేయడం తథ్యమని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది ముందు ముందు చూడాల్సిందేనని విశ్లేషకులు సెలవిస్తున్నారు.
సెనేట్ సభ్యుల విచారణలో..

అనేక ఆసక్తికర విషయాలు ..
ఈ సమాధానంలో ఇప్పుడు అనేక ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానంగా వాట్సప్ యూజర్లు ఆందోళన పడ్డారు. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సప్ ఇప్పటి వరకు ఉచితంగానే సర్వీసులు అందిస్తోంది. ఇప్పటి వరకైతే వాట్సప్‌కు ఎలాంటి యాడ్స్ లేవు. కానీ భవిష్యత్తులో వ్యాపార ప్రకటనలే తమ ప్రధాన రెవెన్యూలు అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పకనే చెప్పేశారు.
లాభాలు ఆర్జించడానికి..
వాట్సప్ నుంచి కూడా లాభాలు ఆర్జించడానికి, దీనిని కూడా యాడ్స్ వైపు మరలిస్తారని తెలుస్తోంది. ఒకవేళ వాట్సప్‌లోకి యాడ్స్ రావడం మొదలు పెడితే, మీ బాయ్‌ఫ్రెండ్‌లకు పంపిన మెసేజ్‌లతో సహా మొత్తం డేటాన్నంతటినీ లోతుగా స్కాన్ చేయడం ఫేస్‌బుక్ ప్రారంభించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని టెక్ విశ్లేషకులంటున్నారు.
యూజర్ల డేటా అంతటినీ..
అయితే వాట్సప్ చాట్‌లన్నీ ఎన్‌క్రిప్టెడ్ అని ఓ వైపు కంపెనీ చెబుతున్నప్పటికీ, ఫేస్‌బుక్ వాట్సప్ యూజర్ల డేటా అంతటినీ స్కాన్ చేస్తూ అడ్వర్‌టైజింగ్ సర్వీసులను ఫేస్‌బుక్ అందిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వాట్సప్ యూజర్లు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాలని హెచ్చరికలు వస్తున్నాయి.
ఇప్పటికే బిజినెస్ సర్వీసులను..
కాగా ఇప్పటికే బిజినెస్ సర్వీసులను అందించడానికి వాట్సప్ బటన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఫేస్‌బుక్ యాడ్‌చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. దీంతో పాటు వాట్సప్ ఫర్ బిజినెసెస్ అనే ఫీచర్‌ను కూడా వాట్సప్ తీసుకొచ్చింది. దీంతో యాడ్స్ అనేవి నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి.
వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కోసం..
మరోవైపు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కోసం ఫేస్‌బుక్‌తో వాట్సప్ యూజర్ల డేటాను షేర్ చేస్తున్నామని అంతకముందే వాట్సప్ కంపెనీ ప్రకటించింది. దీనిపై పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు దేశాల్లో దీనిని నిరాకరిస్తూనే ఉన్నారు. వాట్సప్ దీని కోసం తన ప్రైవసీ పాలసీని కూడా మార్చేసింది.
ఈ పరిణామాలను..

Tags:
tech