ఐపిఎల్‌కు కొత్త యాప్స్‌!




ఐపిఎల్‌కు కొత్త యాప్స్‌!




క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించే క్రికెట్‌ ఫార్మెట్‌ ఐపిల్‌. చివరి బంతివరకూ నరాలు తెగే ఉత్కంఠతో సాగే ఈ ఆటను ఆస్వాదించని క్రికెట్‌ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రికెట్‌ స్కోర్‌ ను మినిట్‌ టూ మినిట్‌ అందిస్తూ, లైవ్‌ టెలికాస్ట్‌ చేసే యాప్స్‌ ఇప్పుడు అందుబాటులో వున్నాయి. ప్రతి నిమిషం క్రికెట్‌ అప్‌ డేట్‌ ను ఈ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆయా మ్యాచ్‌లలోని హైలైట్‌ అంశాలను సైతం ఈ యాప్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసం అందుబాటులో వున్న కొన్ని యాప్స్‌ మీకోసం...
CricBuzz : క్రికెట్‌ ప్రేమికులు అమితంగా ఇష్టపడే ఉత్తమమైన యాప్‌ ఇది. ఈ యాప్‌లో మీకు బాల్‌ టూ బాట్‌ బాల్‌, కామెంటరీ మాత్రమే కాకుండా పాత మ్యాచులను కూడా చూసే అవకాశం ఉంది. ట్రాక్‌ మ్యాచ్‌ స్టాట్స్‌, ప్లేయర్‌ స్టాట్స్‌, రికార్డ్స్‌, అలాగే మీకు ఇష్టమైన క్రికెట్‌ ప్లేయర్‌ ప్రొఫైల్‌ వారికి సంబంధించిన క్రికెట్‌ సమాచారం తెలుసుకోవచ్చు.
Hotstar : ఈ యాప్‌ ద్వారా ఎక్కడనుంచైనా ఆట మొత్తాన్ని చూసి ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయాల్లో సైతం మీరు ఆట మొత్తాన్ని చూసే అవకాశం ఉంది. మీరు నెలకి రూ.190 చెల్లిస్తే మీకు exclusive movies, TV shows కూడా లభిస్తాయి.
Official IPL 2017 App : ఎటువంటి యాడ్స్‌ లేకుండా ఐపీఎల్‌ ఆస్వాదించాలనుకుంటే అందుకు సరైన యాప్‌ ఇది. ఇందులో కూడా బాల్‌ టూ బాల్‌ స్కోరుతో పాటు వీడియో హైలెట్స్‌, ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో వుంటాయి. దీంతో పాటు మీకు లైవ్‌ ఫొటోలు ఇంటర్యూలు కూడా ఇందులో చూడొచ్చు.
Espncricinfo Cricket: కంటెంటె పరంగా చూడాలనుకుంటే ఈ యాప్‌ను మించినది లేదు. దీనిలోని సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో బుక్‌మార్క్‌తో కూడిన స్టోరీలతో పాటు మ్యాచ్‌ జరిగే తేదీలు అందుబాటులో ఉంటాయి.
IPL Live Score: ఇది మీకు ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉన్న సమయంలో కూడా బాగా పనిచేస్తుంది. ఎటువంటి అంతరాయం లేకుండా మ్యాచ్‌ మొత్తాన్ని దీని ద్వారా అభిమానులు చూడవచ్చు.
అలాగే ఎయిర్‌ టెల్‌, జియో కూడా తమ యాప్‌ల ద్వారా ఈ ఐపిఎల్‌ మ్యాచ్‌ వివరాలను అందిస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post