బెంగళూరు: ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా మరోస్టార్టప్ కంపెనీని చేజిక్కించుకుంది. ఈ మేరకు మింత్రా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ టెకొవర్ ద్వారా బలమైన సాంకేతిక బంధాన్ని తయారుచేసుకోవడంతోపాటు, తన ఉత్పత్తి అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకోనున్నట్టు వెల్లడించింది. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో తమ స్థానాన్ని పటిష్టానికి ఈ సముపార్జన సహాయం చేస్తుందని మింత్రాచీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జయేంద్రన్ వేణుగోపాల్ చెప్పారు. 300కోట్ల టర్నోవర్ తోవేగంగా విస్తరిస్తున్న ఈ పరిశ్రమలో ఆన్‌లైన్ వ్యాపారం 60శాతంగా ఉందని తెలిపారు. విట్‌వర్క్స్‌ను 2014 లో స్థాపించారు.
Tags:
tech
