ఎయిర్‌టెల్ రూ.249 ప్యాక్‌కు పోటీగా ఐడియా కొత్త ప్యాక్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. అంతే ప్యాక్‌లో సేమ్ టు సేమ్ ప్రయోజనాలు ఐడియా అందిస్తోంది. 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను(రోమింగ్ కలిపి), ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లను ఈ ప్యాక్‌తో అందించనుంది. అయితే వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ రూ.249తో ఈ ప్రయోజనాలు కల్పిస్తుండగా.. రిలయన్స్ జియో సేమ్ అవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియాలో రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులు ఉన్నాయి.
Tags:
tech
