నువ్వులు చేసే మేలు


నువ్వులు చేసే మేలు




నువ్వులు సాధారణంగా అందరికీ తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్నిరకాల పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని 'పవర్‌ హౌసెస్‌' అంటారు. ఇవి మినరల్స్‌, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, థయామిన్‌, విటమిన్‌ 'ఇ' లను కలిగి ఉంటాయి.అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే చాలారకాల మూలకాలు వీటిలో ఉంటాయి. నువ్వు గింజల్లో నూనె పదార్థంతో పాటు ప్రోటీనూ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తెల్ల, నల్ల నువ్వులు అని రెండు రకాలు. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్లోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ వీటిని విరివిగా వినియోగిస్తారు.

చర్మ సంరక్షణ
చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వులనూనెలో ఉన్న 'ఇ' / 'బి' విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్నిరకాల సమస్యలను దూరం చేసే గుణం వీటిల్లో పుష్కలంగా ఉంది. నువ్వుల నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖాన్ని తాజాగా, యవ్వనంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు.

చిన్నారుల దేహం పుష్టిగా
చిన్నారుల ఆరోగ్యం, అందం విషయంలో నువ్వుల నూనెది కీలకపాత్ర. దీనిలోని విటమిన్స్‌, మినరల్స్‌ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్‌-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటి యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ బి36.. వంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే.. హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు ముందు నువ్వులనూనెతో ఒళ్లంతా రుద్దితే, పిల్లల చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

బీపీని నియంత్రిస్తుంది
ఈ నూనెలోని ఒమెగా-3 ఫాటీ ఆమ్లాల వల్ల పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడడంతో పాటు .. బిపి స్థాయి ఎక్కువ లేదా తక్కువస్థాయిలో ఉన్న వారికి సమస్థాయికి తీసుకొస్తుంది. అంతేకాకుండా, వయసు పైబడ్డవారు ఈ నూనెతో చేసిన పదార్థాలను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటారు.

Post a Comment

Previous Post Next Post