వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ !

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌... ఆండ్రాయిడ్‌ బీటా వినియోగదార్లకు మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో తమ వాట్సాప్‌ నెంబర్లను సులభంగా మార్చుకోవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు కూడా డేటాను అంతేసులభంగా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో 'ఛేంజ్‌ నెంబర్‌' పేరుతో వున్న ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, విండోస్‌ డివైజ్‌లకి కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో అన్ని లేదా కొన్ని కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలనుకుంటే, వినియోగదార్లు ఆయా కాంటాక్ట్‌ నెంబర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఛాట్‌ హిస్టరీని కొత్త ఛాట్‌లోకి మార్చుకోవచ్చు, డూప్లికేట్‌ ఛాట్‌లను డిలీట్‌ చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదార్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ఈ 'ఛేంజ్‌ నెంబర్‌'అనే అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నెంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక, మీ కొత్త నెంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతోంది. కొత్త నెంబర్‌లోకి మారిన తర్వాత, పాత ఛాట్‌లో ఉన్న షేర్డ్‌ మెసేజ్‌లు, కొత్త దానిలోకి మరలుతాయని డబ్ల్యూబీటాఇన్ఫో ఓ ట్వీట్‌ ద్వారా తెలిపింది

Post a Comment

Previous Post Next Post