మనం నిత్యం వాడే కూరగాయల్లో టమాటాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. ప్రతి వంటకంలోనూ టమాటాలను వేస్తారు. వాటితో ఆయా వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయతే టమాటాలను కూర రూపంలో కాకుండా నిత్యం జ్యూస్ రూపంలో తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున టమాటా జ్యూస్ తాగితే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇంకా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాంటీ ఆక్సిడెంట్లు
టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్లే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ క్రమంలో రోజూ టమాటా జ్యూస్ తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో కణజాలం నశించకుండా చూస్తాయి.
2. జీర్ణ సమస్యలు
తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. దీంతో మలబద్దకం పోయి విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
3. రక్తం గడ్డకట్టడం
టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.
4. కొలెస్ట్రాల్
టమాటాల్లో ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తనాళాల గోడలను దృఢంగా చేస్తాయి.
5. వ్యర్థాలు
నిత్యం టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది.
6. నేత్ర సమస్యలు
టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి.
7. వ్యాయామం
రోజూ గంటల తరబడి వ్యాయామం చేసే వారికి, శారీరక శ్రమ చేసే వారికి అవసరమైన పోషకాలను టమాటా జ్యూస్ ఇస్తుంది. వారికి మళ్లీ శక్తి లభించి యాక్టివ్‌గా మారుతారు.
Tags:
tech
