ఐపీఎల్‌లో మూడోవాడు రషీద్‌ఖాన్‌

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రషీద్‌ ఖాన్ 13 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. అంతేకాదు 18 డాట్స్ బాల్స్ వేసి ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన‌ మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా చెరో మ్యాచ్‌లో అత్యధికంగా 18 డాట్‌ బాల్స్‌ వేశారు. అశ్విన్‌ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. గురువారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రషీద్‌ఖాన్‌ 18 డాట్‌ బాల్స్‌ వేశాడు. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు రషీద్‌ ఖాన్‌కే దక్కింది. ఈ సీజన్‌ ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ 15 డాట్‌ బాల్స్‌ వేశాడు.

ఐపీఎల్‌లో మూడోవాడు రషీద్‌ఖాన్‌

Post a Comment

Previous Post Next Post