బెంగళూరు: ఐపిఎల్‌లో విరాట్ కోహ్లి సేన తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇదే మొదటి గెలుపు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.2 ఓవర్లలోనే కేవలం 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన రాహుల్ 4 సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 33 పరుగులు చేశాడు. మిగతావారిలో కరుణ్ నాయర్ (33) మాత్రమే రాణించాడు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించి పంజాబ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఉమేశ్‌కు మూడు వికెట్లు దక్కగా, వోక్స్, కుల్వంత్, వాషింగ్టన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మరో మూడు బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. డివిలియర్స్ 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో57 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. డికాక్ 45 పరుగులతో తనవంతు పాత్ర పోషించాడు.
Tags:
tech
