వాషింగ్టన్: 'గత వారం సిరియాలో రసాయన దాడి జరిగి సుమారు 75 మంది అమాయకులు చనిపోయారు. ఈ పని చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. ఇలాంటి దుర్మార్గం చేసిన వారు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారు' అని ట్రంప్ వైట్‌హౌజ్ సాక్షిగా హెచ్చరించారు. అవసరమైతే సిరియాపై సైనిక దాడి జరుపుతామని ఆయన ప్రకటించారు. అనుకున్నది తడవుగా అమెరికా సేనలు సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే సిరియాలో మూడు వివాదాస్పద ప్రాంతాల్లో సేనలు విరుకుపడుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సైనలు కూడా ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. రసాయన ఆయుధాలు ఇలా విరివిగా ఉపయోగిస్తే ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లుతుందని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. ఈ చర్యలను ఆదిలోనే అంతం చేయాలని అంతర్జాతీయ మీడియా ప్రపంచ దేశాలకు సూచిస్తోంది.
Tags:
tech