అంటార్కిటికా నుంచి విడిపోయిన అతిపెద్ద ఐస్‌బర్గ్‌

వాషింగ్టన్‌ : అంటార్కిటికా నుంచి విడిపోయి మహాసముద్రంపై తేలియాడుతున్న అతిపెద్ద ఐస్‌ బర్గ్‌ చిత్రాలను నేషనల్‌ ఎయిరోనాటిక్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) శాస్త్రజ్ఞులు దగ్గరి నుంచి ఫొటోలు తీసి విడుదల చేశారు. ప్రపంచ చరిత్రలో అంటార్కిటికా నుంచి విడిపోయిన అతి భారీ మంచు కొండల్లో ఇది ఒకటని, డెలావరే రాష్ట్రం ఎంత పరిధిలో ఉంటుందో సుమారు అంత వైశాల్యంలో ఇది ఉందని వెల్లడించారు. ''నేను దిగ్భ్రాంతి చెందాను. మేము ఈ ఐస్‌బర్గ్‌ మీదే ప్రయాణించాం. మంచు పర్వతంలో ఓ భాగంగానే ఇది కనిపించింది. ఇది ఎంతో పెద్దది'' అని గతనెలలో ఐస్‌ బ్రిడ్జి ఆపరేషన్‌ కోసం అంటార్కిటికా వెళ్లిన నాసా బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నాథన్‌ కుర్ట్స్‌ వ్యాఖ్యానించారు. అది అంటార్కిటికా ఖండం నుంచి పూర్తిగా విడిపోయిందని, విషయం పూర్తిగా తెలుసుకుని తామంతా షాక్‌కు గురయ్యామని అన్నారు. దీనికి ఏ-68 అని పేరు పెట్టినట్టు చెప్పారు. కాగా, ఈ సంవత్సరం జూలైలో 2,200 చదరపు మైళ్ల వైశాల్యమున్న మంచు కొండ నీటిపై తేలుతోందని శాటిలైట్‌ చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే.

అంటార్కిటికా నుంచి విడిపోయిన అతిపెద్ద ఐస్‌బర్గ్‌

Post a Comment

Previous Post Next Post