సెట్‌టాప్ బాక్సుల్లో చిప్.. జనం అభిరుచిపై సర్కరు నిఘా


సెట్‌టాప్ బాక్సుల్లో చిప్.. జనం అభిరుచిపై సర్కరు నిఘా!




న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ప్రసారాలశాఖ తాజాగా ప్రజలపై దృష్టిసారించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ సెట్‌టాప్ బాక్స్‌లలో చిప్ అమర్చాలని యోచిస్తోంది. తద్వారా ప్రేక్షకులు ఏ ఛానల్ ఎంతసేపు చూస్తున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయమై ఒక అధికారి మాట్లాడుతూ టీఆర్పీ రేటింగ్ ను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందన్నారు. తద్వారా ప్రభుత్వం ప్రకటనలను తగిన రీతిలో ఇవ్వగలుగుతుందని, ఈ విధంగా ప్రభుత్వ ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ విషయమై డీటీహెచ్ ఆపరేటర్లకు ప్రభుత్వం... నూతన సెట్‌టాప్ బాక్సులలో చిప్ అమర్చాలని తెలియజేసిందన్నారు.

Post a Comment

Previous Post Next Post