స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన `జురాసిక్ పార్క్` సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఈ సిరీస్‌కి ప్యారలల్‌గా నడిపిస్తున్న వేరొక ఛాలెంజింగ్ సిరీస్ `జురాసిక్ వరల్డ్`. ఇందులో మొదటి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన వసూళ్లు సాధించింది. సాంకేతికతను అత్యుత్తమంగా ఆవిష్కరించడంలో ఈ సినిమా దర్శకనిర్మాతలు, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ మెంబర్స్ సఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తాజాగా రిలీజవుతున్న `జురాసిక్ వరల్డ్-2` (ఫాలెన్ కింగ్‌డమ్) సాంకేతికత పరంగా మరో లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇదివరకూ రిలీజైన ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. మరో సంచలనానికి స్పీల్‌బర్గ్ సన్నాహాలు చేస్తున్నారని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది అప్పటినుంచి. అయితే ఈ చిత్రానికి స్పీల్‌బర్గ్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ సినిమాలో కీలకమైన మార్పుల కోసం ఇన్‌సెప్షన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్‌ని బరిలో దించాడని ఇదివరకూ ప్రచారం సాగింది. అసలు దర్శకుడు జె.ఎ.బయోనాతో కలిసి నోలాన్ పని చేశారన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కొత్త టీజర్ రిలీజైంది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అల్లాడించిందంటే అతిశయోక్తి కాదు. రాక్షస డైనోసార్ నగరంపై పడి, మనుషుల్ని వెంబడిస్తుంటే పుట్టే ఆ భయం అనుభవించి తీరాల్సిందే. అందుకోసం 22 జూన్ వరల్డ్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఈలోగా ఈ టీజర్‌లో గ్లింప్స్ వీక్షించండి.
[embed]https://youtu.be/OogedrOiq8I[/embed]
Tags:
tech
