మూడో ప్రపంచ యుద్ధం.. భారతదేశం ఎటువైపు ?

మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతోందంటూ హెచ్చరించిన రష్యా అధికారిక మీడియా

నీళ్లు, తినుబండారాలు దాచుకోవాలని సూచన


మూడో ప్రపంచ యుద్ధం.. భారతదేశం ఎటువైపు ?




Third party image reference

బాంబుపేలుళ్లు, విస్ఫోటనాలు.. శిథిలాల దిబ్బగా మారిన నగరాలు.. రహదారుల్లో రక్తపుటేరులు.. బిక్కుబిక్కుమంటున్న పసిమోములు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. ఇవి ప్రస్తుతం గల్ఫ్ లోని కొన్ని దేశాల్లో కనిపిస్తున్న దృశ్యాలు.. ముఖ్యంగా రెండు అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యాల మధ్య నలిగిపోతున్న సిరియా పరిస్థితి. ఇప్పుడు ఈ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

రెండు వైపులా అనేక దేశాలు

ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో అనేక అంతర్యుద్ధాలు జరిగాయి. అక్కడి ప్రభుత్వాలను అమెరికా పడగొట్టింది. కాని ఇక్కడ సిరియా పరిస్థితి వేరుగా ఉంది. సిరియాలో సున్నీ జనాభా అధికం. కానీ ఆ దేశాధ్యక్షుడు బషర్-అల్ అసద్ మాత్రం షియా. దీనికితోడు నియంతృత్వ ధోరణి, పాలనావైఫల్యాలపై తిరుగుబాటు మొదలైంది. అదే సమయంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులతోనూ, ఐఎస్ దళాలతోనూ బషర్-అల్-అసద్ ప్రభుత్వ సేనలు పోరు సాగిస్తున్నాయి. రెండు అగ్రరాజ్యాలు రెండువైపులా మద్దతుగా నిలువడంతో సిరియా అనే చిన్న దేశంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

తలదూర్చిన ఇతర దేశాలు

అమెరికా, రష్యాలు మాత్రమే కాదు.. ఇతర దేశాలు కూడా సిరియా అంతర్యుద్ధంలో తలదూర్చాయి. కొన్ని అమెరికా తరపున నిలవగా, మరికొన్ని రష్యాతరపున నిలిచాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసద్ ప్రభుత్వానికి ఇరాన్ ప్రభుత్వం, హిజ్బుల్లా సంస్థలు అండగా నిలిచాయి. దేశభద్రత పేరిట ఇజ్రాయెల్ కూడా సిరియా అంతర్యుద్ధంలోకి ప్రవేశించింది. టర్కీ తిరుగుబాటు సేనలకు మద్దతునిస్తున్నది.

మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి.

మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రష్యా ప్రజలను ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ రోస్సియా-24 హెచ్చరికలు చేసింది. సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. బాంబు షెల్టర్‌లలో ఉంటున్న సమయంలో ఐయోడిన్‌ ప్యాకెట్లను దగ్గరలో ఉంచుకుని రేడియేషన్‌కు గురి కాకుండా శరీరానికి రాసుకోవాలని చెప్పింది. ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. బియ్యం, ఓట్స్‌ వంటి ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం వల్ల వాటిని ఎక్కువకాలం వినియోగించడానికి అవకాశం ఉంటుందని వివరించింది. ఏడాది క్రితమే ఈ కోల్డ్‌వార్‌ చాపకింద నీరులా వచ్చిందని, అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదని, ఇప్పుడు తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.







Third party image reference

బాంబుల వర్షం

ఇప్పుడు సిరియా రక్తసిక్తమవుతోంది. అక్కడ ఉన్న అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు తెలుపుతుండగా, తిరుగుబాటుదారులకు అమెరికా వంత పాడుతోంది. దీంతో అక్కడి సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇటీవల సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులు ఉన్న ప్రాంతాల్లో రసాయనిక దాడులు జరపగా, దాన్ని ఖండిస్తూ సిరియాపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. సిరియా వైమానిక రక్షణ వ్యవస్థ, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌పై క్షిపణుల వర్షం కురిపించిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌. అమెరికాకు చెందిన బీ1 బాంబర్లు, బ్రిటన్‌కు చెందిన టోర్నడో జెట్లు, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నాయి. వందకు పైగా క్షిపణులతో దాడి చేసి ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి.

డౌమాలో రసాయన దాడుల పేరుతో..

సిరియాలోని డౌమా పట్టణంలో ఇటీవల రసాయన దాడులు జరిగాయని అమెరికా ప్రధాన ఆరోపణ. వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడు వందలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ దాడులను అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. సొంత ప్రజలపైనే రసాయన దాడులకు పాల్పడ్డారంటూ సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడు దేశాలు మధ్యదరా సముద్రంలో మోహరించిన నౌకలపై మానవసహిత విమానాల ద్వారా, ఇతర వైమానిక స్థావరాల నుంచి దాడులు చేస్తున్నారు.

పుతిన్ విఫలమా..

సిరియాలో రసాయన ఆయుధాలు లేకుండా చేస్తామని 2013లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హామీ ఇచ్చారు. అయితే మళ్లీ ఇప్పడు రసాయనిక దాడులు జరగడంతో పుతిన్ విఫలమయ్యారంటూ అమెరికా చెబుతోంది.

అమెరికా దురాక్రమణ.. రష్యా

సిరియాపై అమెరికా వైమానిక దాడులను దురాక్రమణ చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చేసిన ఈ దాడులపై ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కావాలని డిమాండ్‌ చేశారు. సిరియాలోని డౌమాలో రసాయన దాడులు జరగలేదని, రసాయన దాడుల నెపంతో అమెరికా, దాని మిత్ర పక్షాలు దాడులకు తెగబడడం సరికాదన్నారు.

ప్రభుత్వానికి మద్దతుగా..

అమెరికా దాడులపై సిరియన్లు ఖండించారు. అధ్యక్షుడు అసద్‌కు మద్దతుగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. దాడులు జరిగిన వెనువెంటనే సిరియా, రష్యా, ఇరాన్‌ జాతీయ పతాకాలను చేతుల్లో పట్టుకొని ర్యాలీలు చేశారు. క్షిపణులకు భయపడం అంటూ నినదించారు. లక్షలాది మంది సిరియన్లు ర్యాలీలో పాల్గొ న్నారు.







Third party image reference

ఏడేండ్లుగా యుద్ధమే..

సిరియాలో అంతర్యుద్ధానికి ఏడేండ్లు. ప్రభుత్వానికి రష్యా, తిరుగుబాటుదారులకు అమెరికా వంత పాడుతూ యుద్ధాన్ని ఆగనివ్వకపోవడంతో ఏడు సంవత్సరాల్లో సుమారు 4.70 లక్షల మంది హతమయ్యారు. సున్నీ జనాభా అధికంగా ఉన్న సిరియాలో దేశాధ్యక్షుడు బషర్-అల్ అసద్ మాత్రం షియా. దీనికితోడు నియంతృత్వ ధోరణి, పాలనావైఫల్యాలపై తిరుగుబాటు మొదలైంది. అదే సమయంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులతోనూ, ఐఎస్ దళాలతోనూ బషర్-అల్-అసద్ ప్రభుత్వ సేనలు పోరు సాగిస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘చీలిక’

రసాయన దాడిగా ఆరోపణలున్న సిరియా దాడిపై సరికొత్త విచారణ జరపాలన్న అమెరికా ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చీలిక ఏర్పడింది. ఈ ప్రతిపాదనపై ఓటింగ్‌కు చైనా దూరంగా ఉంది. రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. దీంతో అమెరికా ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. ఇదే అంశంపై రష్యా ప్రవేశపెట్టిన మరొక ప్రతిపాదనకు కూడా తగినంత మద్దతు లభించలేదు.

 సిరియా స్పందన.. 

తన సైనిక వైమానిక స్థావరంపై అమెరికా క్షిపణి దాడిని సిరియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ సేనలపై తరచుగా దాడులు చేసే ఇస్లామిక్‌స్టేట్‌ను.. అమెరికాను ఒకే గాటన కట్టి పరుషమైన పదజాలంతో విమర్శించింది. ‘‘ఈ దాడులు అమెరికాను.. సిరియా సైనిక స్థావరాలపై దాడులు చేసే ఇస్లామిక్‌స్టేట్‌, నుస్రా ఫ్రంట్‌ తదితర ఉగ్రవాద సంస్థ భాగస్వామిగా మార్చాయి’’ అని పేర్కొంది. ఇది అమెరికా అనుసరిస్తున్న తప్పుడు వ్యూహంగా అభివర్ణించింది. ఇక.. సిరియా అధ్యక్ష కార్యాలయం ఈ దాడులను అమెరికా బాధ్యతా రాహిత్యానికి.. ఆ దేశ హ్రస్వదృష్టికి నిదర్శనంగా పేర్కొం ది. కాగా.. అమెరికా దాడిలో ఆరుగురు మరణించారని.. పలువురు గాయపడ్డారని అసద్‌ సాయుధ దళాలు తొలుత ప్రకటించాయి. అయితే, నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించినట్టు సిరియా అధికారిక మీడియా తెలిపింది.

తొమాహాక్‌ మిసైల్‌

సిరియాపై దాడిలో 59 తొమాహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులు వినియోగించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయటంలో వీటిని అమెరికా వాడింది. వెయ్యి పౌండ్ల బరువైన వార్‌హెడ్‌లను ఇది మోసుకెళ్లగలదు. 20 అడుగుల పొడుగుండే తొమాహాక్‌ గంటలకు 880 కిలోమీటర్ల వేగంతో దూసుపోతుంది. అయితే శుక్రవారం నాటి దాడుల్లో తొలిసారిగా నేవీ నౌకలనుంచి ఎయిర్‌బేస్‌పైకి దీన్నివినియోగించారు.

భారతదేశం ఎటువైపు

సిరియా కేంద్రంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే భారతదేశం ఎటువైపు నిలుస్తుందనే చర్చ మొదలైంది. భారతదేశానికి అమెరికా, రష్యా రెండు మిత్రదేశాలే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రష్యా భారతదేశానికి ఆయుధ సంపత్తిని సరఫరా చేసింది. అమెరికా కూడా భారత్ కు అన్ని విధాలా తోడ్పాటునందిస్తూ వస్తోంది. దీంతో భారతదేశంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా రెండు దేశాలతో మైత్రి సంబంధాలు కొనసాగిస్తూనే వస్తున్నాయి. ఇటీవల రష్యా కంటే అమెరికాతో వాణిజ్య సంబంధాలను ఇండియా బలోపేతం చేసుకుంది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటికిప్పుడైతే ఇండియా వేలుపెట్టే పరిస్థితి లేదు. మరి మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే ఇండియా ఎటువైపు ఉంటుందో. ఎవరికి మద్దతిస్తుందో అనే చర్చలు జరుగుతున్నాయి. కొందరు అమెరికాకు మద్దతిస్తుందని చెబుతుండగా, మరికొందరు రష్యాకు మద్దతిస్తుందని చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post